హైదరాబాద్ పరిధిలోని. మూడు మున్సిపల్.కార్పొరేషన్ లో తొలుత జీ హెచ్ ఎంసీ లకే ఎన్నికలు
హైదరాబాద్, 31 మే (హి.స.) , హైదరాబాద్: రాజధాని పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో.. తొలుత జీహెచ్ఎంసీకే ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబరులో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. సర్ పేరుతో జరగనున్న ఓటరు సవరణ కార్యక్రమం అక్టోబర
హైదరాబాద్ పరిధిలోని. మూడు మున్సిపల్.కార్పొరేషన్ లో తొలుత  జీ హెచ్ ఎంసీ లకే ఎన్నికలు


హైదరాబాద్, 31 మే (హి.స.)

, హైదరాబాద్: రాజధాని పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో.. తొలుత జీహెచ్ఎంసీకే ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబరులో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. సర్ పేరుతో జరగనున్న ఓటరు సవరణ కార్యక్రమం అక్టోబరు రెండో వారంతో ముగియనుండగా, ఆ ఓటరు జాబితా ఆధారంగా అదే నెలలో కొత్తగా ఏర్పడిన డివిజన్లకు పోలింగ్ కేంద్రాలను నిర్ణయిస్తారు. ప్రభుత్వం చేపట్టిన బీసీ సర్వే రిపోర్టుల ఆధారంగా డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఆ రెండు ప్రక్రియలు పూర్తవగానే నవంబరులో ఎన్నికల నోటిఫికేషన్ జారీఅవుతుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

తొలుత ఒక్కదానికే ఎందుకంటే..

మొదట జీహెచ్ఎంసీకి మాత్రమే ఎన్నికలు నిర్వహించడానికి రెండు కారణాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనంచేసి మూడు కార్పొరేషన్లుగా పునర్విభజించింది. ఫిబ్రవరి10, 2026న జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు పూర్తవగా ఫిబ్రవరి 11, 2026న జీహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా కొత్తగా ఎంఎంసీ, సీఎంసీ ఏర్పాటయ్యాయి. మూడు కార్పొరేషన్లకూ జీహెచ్ఎంసీ చట్టమే వర్తిస్తుంది. ఆ చట్టం ప్రకారం పాలకమండలి గడువు పూర్తయిన ఆర్నెల్లలో ఎన్నికలు నిర్వహించాలి. ఈ నిబంధన గతంలో ఎన్నికలు జరిగిన జీహెచ్ఎంసీకి మాత్రమే వర్తిస్తుంది. పునర్విభజనతో ఓఆర్ఆర్ పరిధిలో స్థానిక సంస్థల రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారింది. దాదాపు 28 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మూడు కార్పొరేషన్ల పరిధిలో ఏ కార్పొరేషన్ను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనే అంచనాలపై రాజకీయ వర్గాల్లో అయోమయం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 60-70 స్థానాలు ఓ పార్టీకి దక్కే అవకాశం ఉంది. మిగిలిన స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంటుందని అంచనా. ప్రజాభిప్రాయాన్ని విశ్లేషించుకుని సీఎంసీ, ఎంఎంసీలకు ఎన్నికల నిర్వహించాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

శివారులో గందరగోళం..

పాత జీహెచ్ఎంసీలోని కొంత భాగం మల్కాజిగిరి, సైబరాబాద్ నగరపాలక సంస్థలకు బదలాయింపు అయింది. శంషాబాద్ నుంచి ఆదిభట్ల వరకు ఉన్న పలు స్థానిక సంస్థలు గ్రేటర్లో కలిశాయి. దాంతో గ్రేటర్ ఎన్నికల్లో ఆయా స్థానిక సంస్థల పరిధిలోని డివిజన్లలో ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే విషయమై గందరగోళం నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande