
విశాఖపట్నం, 31 మే (హి.స.)
: గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపు వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక డ్రైవర్ మృతిచెందగా, ఏడుగురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ