
సత్తెనపల్లి, 31 మే (హి.స.)
, : అమెరికాలో తెలుగు తేజానికి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. ఆ దేశంలో కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చే వారికి ఏటా మిన్నెసోటా అస్పిరేషన్స్ ఇన్ కంప్యూటింగ్ అవార్డులు అందజేస్తున్నారు. అందులో భాగంగా తెలుగు అమ్మాయి అనన్య గోలి స్టేట్ హానరబుల్ మెన్షన్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. సత్తెనపల్లికి చెందిన గోలి కృష్ణ చైతన్య, సంపా సిన్హా దంపతులు 2014లో అమెరికా వెళ్లి అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ దంపతుల కుమార్తె అనన్య ప్రస్తుతం ఈడెన్ ప్రైరీ హైస్కూల్లో సోఫామోర్ సెకండియర్ (మనదేశంలో పదో తరగతితో సమానం) చదువుతోంది. చిన్న వయసులోనే సాంకేతిక రంగంలో అద్భుతమైన లీడర్షిప్ నైపుణ్యాలను ప్రదర్శించి అనన్య ఆదర్శంగా నిలిచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ