
అమరావతి, 31 మే (హి.స.)
నర్సీపట్నం, డ్వాక్రా మహిళల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే వీరి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు భరోసాగా నిలవాలని నిర్ణయించింది. ‘కల్యాణ లక్ష్మి’ పేరిట స్వల్ప వడ్డీకి రుణ సదుపాయం కల్పించనుంది. ఈ పథకానికి ఎంత మంది అర్హులో గుర్తించేందుకు సన్నాహాలు చేస్తోంది. రుణం కావాల్సిన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ