నామినేషన్.తిరస్కరణ పై.ఘాటుగా స్పందించిన. మీనాక్షి నటరాజన్
నామినేషన్.తిరస్కరణ పై.ఘాటుగా స్పందించిన. మీనాక్షి నటరాజన్
నామినేషన్.తిరస్కరణ పై.ఘాటుగా స్పందించిన. మీనాక్షి నటరాజన్


హైదరాబాద్, 21 జూన్ (హి.స.)

తన కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ స్పష్టం చేశారు. ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్లో ఆమె మాట్లాడుతూ.. తాను మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తిని తెలిపారు. తెలంగాణ నుంచి రాజీనామా చేయించినా తాను ఆ రాజ్యసభ స్థానాన్ని తాను తీసుకోనన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ లాంటి వ్యక్తుల కోసం వేరే రాష్ట్రాలు సీట్లు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. తన లాంటి వారి కోసం తెలంగాణ రాజ్యసభ స్థానాన్ని ఇస్తే.. అందుకు తాను ఒప్పుకోనని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక పోవడానికి చాలా కారణాలు

తన కేసుల అంశాన్ని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నాయకులు సమాచారం ఇచ్చారనేది పచ్చి అబద్ధమని మీనాక్షి నటరాజన్ తెలిపారు. బీజేపీనే కావాలని అబద్ధాలు సృష్టించిందంటూ మండిపడ్డారు. తాను ఎప్పుడైనా బాధితుల పక్షమేనని పేర్కొన్నారు. శ్రీలతకు కూడా తాను అండగా ఉన్నానని చెప్పారు. ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయని వివరించారు. శ్రీలతపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఒక మహిళగా ఆమె వెర్షన్ విన్నామని తెలిపారు. ఆమె బాధను అర్ధం చేసుకొని డీసీసీ అధ్యక్షుడిని తొలగించామని చెప్పారు. కేసు ఉన్నంత మాత్రాన తన నామినేషన్ తిరస్కరణ కాలేదని స్పష్టం చేశారు.

అన్ని విషయాలు బయటకు వస్తాయి..

బీజేపీ, ఎన్నికల సంఘం పూర్తిగా కాంప్రమైజ్ అయ్యాయని.. అందువల్లే తన నామినేషన్ తిరస్కరించారని మీనాక్షి అన్నారు. కేవలం ఇది ఒక్క సీటుకు సంబంధించిన విషయం కాదని తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. తన నామినేషన్ విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలు అబద్ధమని చెప్పారు. గణపతి పాలు తాగుతున్నాడని బీజేపీ అబద్ధాలను సృష్టించిందని సోదాహరణగా వివరించారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం అని.. అన్ని విషయాలు బయటకు వస్తాయని మీనాక్షి నటరాజన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

బయట పడిన బీజేపీ బండారం..

పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ అనేక అబద్ధాలను సృష్టించిందని అన్నారు. రాజ్యసభ నామినేషన్ రిజక్ట్ చేసినందుకు తనకేం బాధ లేదన్నారు. తన నామినేషన్ తిరస్కరించడం వల్ల బీజేపీ బండారం బయట పడిందని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. బీజేపీ నేతలను నామినేషన్ రూంలోని ఎలా అనుమతించారంటూ ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థలన్నీ కాంప్రమైజ్ అయ్యాయని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande