
ఏలూరు జిల్లా, 24 జూన్ (హి.స.) : జంగారెడ్డిగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దేవరపల్లి - తల్లాడ జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించారు. మృతుడు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన గోపాల్ పోసు(31)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ