గుంటూరు జిల్లా మంగళగిరి లోని.సి.లక్ష్మీ.నరసింహస్వామి.ను.దర్శించుకున్న డిప్యూటి సీఎం .పవన్.కళ్యాణ్
గుంటూరు, 24 జూన్ (హి.స.) జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామిని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకుని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పానకాన
గుంటూరు జిల్లా మంగళగిరి లోని.సి.లక్ష్మీ.నరసింహస్వామి.ను.దర్శించుకున్న డిప్యూటి సీఎం .పవన్.కళ్యాణ్


గుంటూరు, 24 జూన్ (హి.స.) జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామిని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ (Pawan Kalyan) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకుని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పానకాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న పవన్కు దేవాదాయశాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. పవన్ వెంట రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande