
తలుపుల, 24 జూన్ (హి.స.)
: శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లి పంచాయతీలోని అగ్రహారం సమీపంలో టిప్పర్ - ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ