భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై.1 న అనంతపురం లో పర్యటించనున్నారు
అమరావతి, 24 జూన్ (హి.స.) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 1న అనంతపురంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (సీయూఏపీ)లోని జ్ఞాన సీమ ప్రాంగణంలో నిర్వహించనున్న విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు క
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై.1 న అనంతపురం లో పర్యటించనున్నారు


అమరావతి, 24 జూన్ (హి.స.) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 1న అనంతపురంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (సీయూఏపీ)లోని జ్ఞాన సీమ ప్రాంగణంలో నిర్వహించనున్న విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీలో బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జగదీష్ సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటనకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా బుధవారం స్నాతకోత్సవ కార్యక్రమ వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్ స్థలాలు, తదితర ఏర్పాట్లను ఎస్పీ సమీక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande