హయాత్నగర్.పోలీస్ స్టేషన్.పరిదిలో రోడ్డు.ప్రమాదం
హైదరాబాద్, 21 జూన్ (హి.స.) హయత్నగర్, : రోజంతా పనిచేసి విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరింది...మరో ఐదు నిమిషాలైతే గమ్యం చేరుకుంటుంది. ఇంతలోనే మృత్యువు బస్సు రూపంలో దూసుకొచ్చి కబళించింది. ఈ ఘటన హయత్నగర్ పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేర
హయాత్నగర్.పోలీస్ స్టేషన్.పరిదిలో రోడ్డు.ప్రమాదం


హైదరాబాద్, 21 జూన్ (హి.స.)

హయత్నగర్, : రోజంతా పనిచేసి విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరింది...మరో ఐదు నిమిషాలైతే గమ్యం చేరుకుంటుంది. ఇంతలోనే మృత్యువు బస్సు రూపంలో దూసుకొచ్చి కబళించింది. ఈ ఘటన హయత్నగర్ పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు......నాగర్కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రానికి చెందిన కొయ్యల బాలయ్య, ఎల్లమ్మ దంపతులు కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చి పెద్దఅంబర్పేట్ ఏ-1 బేకరీ సమీపంలో ముగ్గురు కుమార్తెలతో కలిసి ఉంటున్నారు. వీరి రెండో కుమార్తె ప్రత్యూష(20) బ్యూటీషియన్గా పనిచేస్తోంది. శనివారం రాత్రి 10 గంటల తర్వాత స్కూటీపై పెద్దఅంబర్పేట్ దిశగా బయలుదేరింది. మార్గంమధ్యలో హయత్నగర్లోని పుల్లారెడ్డి స్వీట్హౌస్ సమీపానికి చేరుకోగానే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రత్యూష తీవ్రంగా గాయపడగా సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande