
ఖమ్మం, 21 జూన్ (హి.స.)
'ఫాదర్స్ డే' రోజే ఖమ్మం
(Khammam) జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల మధ్య కలహాలు అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారుల నిండు ప్రాణాలను బలొగొన్నాయి. పోలీసుల కథనం మేరకు.. ఖమ్మం త్రీ టౌన్ పరిధిలో లింగరాజు, స్వాతి దంపతులు నవాసం ఉంటున్నారు. అయితే, గత కొద్దిరోజుల భార్యభర్తల నడుమ పంచాయితీలు జరగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి, ఆవేశానికి గురైన భార్య స్వాతి ఇవాళ ఉదయం తన ఇద్దరు కొడుకులు వేదిక్ కుమార్ (7), తనిష్క్ (5) పురుగుల మందు తాగించింది. అనంతరం స్వాతి కూడా అదే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
అయితే, విష ప్రభావంతో ఇద్దరు చిన్నారులు విలవిలలాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరోవైపు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తల్లి స్వాతిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లుగా వైద్యులు పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు