సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి..
సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి..
Accident


సిద్దిపేట, 21 జూన్ (హి.స.)

సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం లకుడారం గ్రామ శివార్లలోని సబ్స్టేషన్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన మహేందర్ (28), దీక్ష (25)లు హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామానికి స్కూటీపై బయలుదేరారు.

మార్గమధ్యలో లకుడారం సబ్స్టేషన్ సమీపానికి రాగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వీరి స్కూటీ బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద తీవ్రతకు మహేందర్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన దీక్షను కుకునూర్ పల్లి 108 అంబులెన్స్ సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసింది. భార్యాభర్తలు గంటల వ్యవధిలోనే ఒకరి వెనుక ఒకరు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో మృతుల కుటుంబీకులు, స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande