ఇంద్రకీలాద్రి.దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారం
ఇంద్రకీలాద్రి.దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారం
ఇంద్రకీలాద్రి.దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారం


అమరావతి, 22 జూన్ (హి.స.)

:ఇంద్రకీలాద్రి దేవాలయంలో నకిలీ టికెట్ల వ్యవహారంపై . ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిస్పందించారు. ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గతంలో సమర్పించిన నివేదికలు పూర్తిస్థాయిలో లేవని భావిస్తున్ని, అందుకే కొత్తగా విచారణ చేపట్టాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. (సోమవారం) సచివాలయంలో మీడియాతో మంత్రి ఆనం మాట్లాడారు.

కనకదుర్గ దేవాలయంలో నకిలీ టికెట్ల విషయంలో తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం స్పష్టం చేశారు. చాలా ఆలయాల్లో పర్మినెంట్ ఉద్యోగులు ఉండట్లేదని చెప్పుకొచ్చారు. దీంతో అవుట్ సోర్సింగ్లో వచ్చే ఉద్యోగులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగా ఆన్లైన్లో టికెట్ పంచింగ్ చేయకుండా మోసం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి కేసులను సీరియస్గా తీసుకుంటున్నామని అన్నారు. త్వరలో డిజిటలైజ్ పూర్తిగా అయిపోతే ఒకే టికెట్ రిపీటెడ్గా రావడం తగ్గిపోతుందని స్పష్టం చేశారు. వాడపల్లిలో కొద్ది మాసాల్లోనే రూ. కోటి నుంచి సుమారు రూ.10 కోట్లకు ఆదాయం పెరిగిందని వివరించారు. కోనసీమ తిరుపతి కింద ఇప్పుడు వాడపల్లి ఉందని... అక్కడ భూమి లేదని చెప్పారు. ఎవరైనా డొనేషన్ చేస్తే మరింతగా అభివృద్ధి చేస్తామని వివరించారు. జగన్ హయాంలో ఆలయాల్లో జరిగిన తప్పిదాలపై ఇచ్చిన రిపోర్టులు సరిగా లేవని.. వాటిపై సమగ్ర విచారణకు ఆదేశించామని అన్నారు. ఆయా కేసుల్లో వాస్తవాలు నిగ్గుతేల్చాలని కోరామని.. ఇలా రిపోర్టు ఇచ్చిన వారిపైనా విచారణ చేస్తామని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande