
అమరావతి, 22 జూన్ (హి.స.)
మద్దిలపాలెం చైతన్యనగర్కు చెందిన తల్లీకుమారుడు అదృశ్యమయ్యారు. దీనికి సంబంధించి ఎంవీపీకాలనీ పోలీసుస్టేషన్ సి.ఐ. ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాగిత శ్రీనివాస్ కావలిలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే నగరంలోని చైతన్యనగర్లో ఉంటున్న తన భార్య కాగిత పద్మజ (35), కుమారుడు కాగిత జ్ఞానేశ్వర్ (15) కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 6వ తేదీన కుమారుడికి కడుపునొప్పిగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్నిచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంవీపీకాలనీ సీఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ