ప్రకాశం జిల్లా సంత మంగుళూరు మండలం కామేపల్లి.సమీపంలో. రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లా , 22 జూన్ (హి.స.): జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన 10 మంది నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో జరిగ
ప్రకాశం జిల్లా సంత మంగుళూరు మండలం కామేపల్లి.సమీపంలో. రోడ్డు ప్రమాదం


ప్రకాశం జిల్లా , 22 జూన్ (హి.స.): జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన 10 మంది నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో జరిగే దశదిన కర్మకు హాజరయ్యేందుకు ఆటోలో బయల్దేరారు. కామేపల్లి రైల్వే అండర్పాస్ సమీపానికి వచ్చేసరికి.. గ్రానైట్తో వస్తున్న లారీ మలుపుతిరుగుతూ.. ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుకొండలు (60), రమణమ్మ (50) అక్కడిక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఏడుగురిని సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుబ్బాయమ్మ (70) ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande