ఘనంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ప్రారంభమైన తెలంగాణ టీ20 లీగ్
ఘనంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ప్రారంభమైన తెలంగాణ టీ20 లీగ్
ఘనంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ప్రారంభమైన తెలంగాణ టీ20 లీగ్


హైదరాబాద్, 22 జూన్ (హి.స.)హైదరాబాద్లోని

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా తెలంగాణ టీ20 లీగ్ (TG20 League - 2026) మొదటి

సీజన్ జూన్ 21న

అత్యంత వైభవంగా ప్రారంభమైంది.తెలంగాణ

క్రికెట్ అసోసియేషన్ (HCA) గ్రామీణ, స్థానిక యువ క్రికెటర్ల ప్రతిభను

ప్రోత్సహించేందుకు ఈ మెగా టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.

అట్టహాస ఆరంభ వేడుకలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య

అతిథిగా హాజరై టోర్నీని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లీగ్ బ్రాండ్

అంబాసిడర్, టాలీవుడ్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు నేషనల్

క్రికెట్ అకాడమీ (NCA) హెడ్

వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియా

స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, మాజీ

క్రికెటర్ అంబటి రాయుడు, బీసీసీఐ

సభ్యులు చాముండేశ్వరీనాథ్ సహా పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ తన మ్యూజికల్ లైవ్ పర్ఫార్మెన్స్తో

స్టేడియంలోని ప్రేక్షకులను హుషారెత్తించారు.

తొలి సీజన్ లీగ్లో మొత్తం 8

ఫ్రాంచైజీ జట్లు తలపడుతున్నాయి. టోర్నీలోని అన్ని మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలోనే

జరగనున్నాయి. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్తో పాటు

జియో హాట్స్టార్ (JioHotstar) ఓటీటీ

యాప్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. తెలంగాణ నుంచి కొత్త క్రికెట్

తారలను వెలికితీసేందుకు ఈ లీగ్ ఒక అద్భుతమైన వేదికగా నిలవనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande