ఇప్పటికీ దివ్య ఆచూకీ ప్రశ్నార్థకం? ఏమీ చెప్పని పోలీసులు
ఇప్పటికీ దివ్య ఆచూకీ ప్రశ్నార్థకం? ఏమీ చెప్పని పోలీసులు
ఇప్పటికీ దివ్య ఆచూకీ ప్రశ్నార్థకం? ఏమీ చెప్పని పోలీసులు


అమరావతి, 22 జూన్ (హి.స.)

అవనిగడ్డ లంకమ్మ మాన్యం వద్ద పంట కాలువ గట్టుపై నివశిస్తున్న ఆవుల గోపి, కొండాలమ్మల మూడేళ్ల కుమార్తె ఆవుల దివ్య అదృశ్యమై నేటికి 18 మాసాలు గడిచింది. 14.12.2024 మధ్యాహ్నం దివ్యను ఇంటి వద్ద దించి తల్లి బయటకు వెళ్లింది. అత్త, మామ ఇంటి వద్ద ఉన్నారని రోజూలాగే వెళ్లింది. తల్లి ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్ తింటూ ఉంటుందనుకుంది. ఇంటికి తిరిగి వచ్చి చూస్తే కుమార్తె కనపడలేదు. తల్లడిల్లిన తల్లిదండ్రులు అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15వ తేదీన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం 7 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాలనీలో ప్రతి ఇంటినీ వెతికారు. సీసీ టీవీ కెమెరాలను కూడా పరిశీలించారు. ఇంటి పక్కనే పంట కాలువ ఉండటంతో అవనిగడ్డ, నాగాయలంక మండలాల్లో బోట్లలో గాలించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు రెండు బృందాలుగా ఏర్పడి గాలించినా ఆచూకీ లభించలేదు. ఇప్పటికీ దివ్య ఆచూకీ ప్రశ్నార్థకంగానే ఉంది. కాలువలో పడిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఇంకేమైనా జరిగిందా అనే ప్రశ్నలు ఇప్పటికీ అలాగే మిగిలిపోయాయి. ఆ తల్లిదండ్రుల వేదన నేటికీ వర్ణనాతీతంగానే ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande