
హైదరాబాద్, 22 జూన్ (హి.స.)
: ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు 2023లో కేవైసీని ప్రవేశపెట్టారు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు జూన్ 30లోపు కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ ఏజెన్సీల డీలర్ల వద్ద ఈ-కేవైసీ పూర్తి చేసే అవకాశం ఉంది. డీలర్ల వద్ద జనం ఎక్కువగా ఉంటే బారులు తీరాల్సిన అవసరం లేదు. ఇంటి వద్దనే ఫోన్లో యాప్ ద్వారా ఈ-కేవైసీ చేసుకొనే వెసులుబాటును గ్యాస్ కంపెనీలు కల్పించాయి. ఈ-కేవైసీ ఎలా చేయాలి? అందుకు ఏం కావాలో తెలుసుకుందాం.
ఎన్ని విధానాలు..గ్యాస్ కనెక్షన్లను ఆధార్తో అనుసంధానం చేయడంతో పాటు ముఖ గుర్తింపు, వేలిముద్రలు లేదా ఐరిస్ వంటి 3 విధానాలతో ఎల్పీజీ వినియోగదారులు ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్