స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ని బ్లాక్ మెయిల్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. హరీష్ రావు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ని బ్లాక్ మెయిల్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. హరీష్ రావు
హరీష్ రావు


నాగర్ కర్నూల్, 22 జూన్ (హి.స.)

హైదరాబాద్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం ఎకరం భూమిచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంక్కు ఇచ్చిన భూమిని అమ్మేసిండని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎస్బీఐకి ఇచ్చిన భూమిని వేలానికి ఇచ్చిండు.. భూమిని అమ్మేసిండు. అమ్మేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టుకు వెళ్లింది. మాకు ఎకరం భూమి ఇచ్చిర్రు. ఇది కూడా ఉచితంగా ఏం ఇయ్యలేదు. మేము దాదాపు రూ.20 కోట్లు పెట్టి ఈ భూమి కొనుక్కున్నమని.. ఈ భూమి మా పొజిషన్లో ఉన్నది. పైసల్ పెట్టి కొన్న మా భూమి రేవంత్ రెడ్డి ఎట్లా అమ్ముకున్నడు.. అని హైకోర్టుకు పోయారన్నారు.

కోర్టు వాళ్లు పైసలు పెట్టి కొన్నది నిజమే కదా ఈ అమ్మకం తప్పు అని స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఎస్బీఐ మీద పగపట్టిండు. ఎస్బీఐని నిషేధిస్తాం. ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తాం. ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ఖాతాలన్ని తీసేస్తా.. అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్ మెయిల్ చేస్తుండు.. రేవంత్ రెడ్డి తీరు ఎవరన్నా ప్రశ్నిస్తే పగబడమన్నట్టు ఉంది. ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా

అంటున్నడు.. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరల్డ్ బ్యాంక్ కూడా నీ మాట వినలేదనుకో దాన్ని కూడా నిషేధిస్తా అంటాడు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక ఒక బ్యాంక్ అయితే కావాలి కదా.. ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బ్యాంక్నే నిషేధిస్తా అంటే మరి ఏం చేస్తడు.. నాకో డౌటు.. కొత్తగా కొండల్ రెడ్డి బ్యాంక్ అని పెడ్తడో ఏమో.. పెట్టినా పెడ్తడు మస్త్ జమ అయినయ్ పైసలు. రేపు ఎనుముల కొండల్ రెడ్డి బ్యాంక్ అని పెట్టినా పెడ్తరన్నారు హరీశ్ రావు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande