నేను కేసీఆర్ సారంత మంచోడిని అయితే కాదు.. కేటీఆర్
నేను కేసీఆర్ సారంత మంచోడిని అయితే కాదు.. కేటీఆర్
Ktr


వర్ధన్నపేట, 22 జూన్ (హి.స.) వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తోపాటు నియోజకవర్గానికి చెందిన నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లు ఏదీ మర్చిపోము. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని మర్చిపోం.. మనమీద కేసులు పెట్టినోడిని మరిచిపోం. మనతో నిలబడినోళ్లను కూడా మరిచిపోమన్నారు.

తప్పకుండా చెప్తున్నా.. నేను కేసీఆర్ సారంతా మంచోన్నైతే కాదు. వచ్చే ఐదేళ్లు చిట్టినాయుడుకు ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది.. పక్కా విడిచిపెట్ట. రిటైరైనా పారిపోయినా సప్తసముద్రాల అవతల దాక్కున్నా.. ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కడిని వెతికి తెచ్చి మీ ముందట నిలబెట్టే బాధ్యత నాది.. వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. ఇది నేనేం ఊరికే చెప్పడం లేదు.. గుర్తు పెట్టుకోండి. కానీ రమేశన్న (ఆరూరి రమేశ్) వీడు మంచోడేనే అన్నా అని మళ్లా వారిని తీసుకొని రావొద్దని కేటీఆర్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande