మార్కాపురం జిల్లా పామూరు జాతీయ రహదారి పై ప్రభుత్వ అధికారులని చెప్పి దోపిడి
మార్కాపురం జిల్లా పామూరు జాతీయ రహదారి పై ప్రభుత్వ అధికారులని చెప్పి దోపిడి
మార్కాపురం జిల్లా పామూరు జాతీయ రహదారి పై ప్రభుత్వ అధికారులని చెప్పి దోపిడి


పామూరు, 22 జూన్ (హి.స.)

తాము ప్రభుత్వ అధికారులమని చెబుతూ.. హైవేపై లారీలను అడ్డుకొని, డ్రైవర్లు, యజమానులను బెదిరించి నగదు దోచుకుంటున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.45,000 నగదు, ఎయిర్ పిస్టల్, నాటు తుపాకీ, కత్తి, కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కథనం.. ఈ నెల 12, 16 తేదీల్లో మార్కాపురం జిల్లా పామూరు పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారిపై మట్టి లోడుతో వెళ్తున్న లారీలను తాము ప్రభుత్వ అధికారులమంటూ ముగ్గురు దుండగులు అడ్డగించి, తనిఖీలు చేశారు. కేసులు నమోదు చేస్తామని, భారీ జరిమానాలు విధిస్తామని బెదిరించి డ్రైవర్లు, యజమానుల వద్ద నగదు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు.. ఆదివారం పామూరులోని విరాట్నగర్ సెంటర్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగుల వల్ల అప్పుల్లో కూరుకుపోయిన ప్రధాన నిందితుడు సోమన్నపల్లికి చెందిన డి.మల్లికార్జున, బొట్లగూడూరుకు చెందిన బర్రె చిట్టిబాబు, బలిజపాలేనికి చెందిన మచ్చ వంశీలతో కలిసి ఈ దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులను కనిగిరి కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ దుర్గాసి వినోద్కుమార్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande