కోర్తికోట శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు
కోర్తికోట శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు
కోర్తికోట శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు


తనకల్లు, 22 జూన్ (హి.స.): శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం కోర్తికోట గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు.

పేకాట ఆడుతున్న 22 మంది జూదరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుండి రెండు లక్షల ఆరు వేల రూపాయలు నగదు,13 ద్విచక్ర వాహనాలు,21 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కదిరి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర తనకల్లు నల్లచెరువు ఎస్ఐలు దిలీప్ కుమార్ మక్బూల్ వారి సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు.

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ కార్యకలాపాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కదిరి డిఎస్పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో కదిరి సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా నిర్వహిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande