గుంటూరు లాల్పురానికి చెందిన 90 ఏళ్ల రైతు మంచాల రామయ్య దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు
అమరావతి, 23 జూన్ (హి.స.) గుంటూరు వైద్యం, : గుంటూరు లాల్పురానికి చెందిన 90 ఏళ్ల రైతు మంచాల రామయ్య దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. రూ.10 లక్షల విరాళం అందించడంతో గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్(ఎంఈయూ)ను ఆధునికీకరించారు. దీనిని వైద్య
గుంటూరు లాల్పురానికి చెందిన 90 ఏళ్ల రైతు మంచాల రామయ్య దంపతులు  పెద్ద మనసు చాటుకున్నారు


అమరావతి, 23 జూన్ (హి.స.)

గుంటూరు వైద్యం, : గుంటూరు లాల్పురానికి చెందిన 90 ఏళ్ల రైతు మంచాల రామయ్య దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. రూ.10 లక్షల విరాళం అందించడంతో గుంటూరు వైద్య కళాశాలలో మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్(ఎంఈయూ)ను ఆధునికీకరించారు. దీనిని వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎన్.వి.సుందరాచారి సోమవారం ప్రారంభించారు. అనారోగ్య కారణంగా కార్యక్రమానికి హాజరుకాని 90 ఏళ్ల దాత రామయ్య ఇంటికి ప్రిన్సిపల్ వెళ్లి సన్మానించారు. ఈ సందర్భంగా సుందరాచారి మాట్లాడుతూ భవిష్యత్తు వైద్యుల కోసం ఆయన అందించిన సహకారం చిరస్మరణీయంగా నిలుస్తుందన్నారు. ఎన్ఎంసీ మార్గదర్శకాలతో సీబీఎంఈ పాఠ్యప్రణాళిక అమలుకు ఎంఈయూ కీలకమని, యూనిట్ పునరుద్ధరణతో వైద్య విద్యాప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. ఇప్పటికే రామయ్య వందకు పైగా జైపుర్ కృత్రిమ కాళ్లు, జీజీహెచ్ కార్డియాలజీకి ఎకో మెషిన్ విరాళంగా ఇచ్చారని, ఆయన మంచి మనసుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande