విజ్ఞాన్స యూనివర్సిటీ కృత్రిమ మేధస్సు అథారి త విద్య విధానంలో మార్పునకు తెర
అమరావతి, 23 జూన్ (హి.స.) అమరావతి: భవిష్యత్తు సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత విద్యా విధానంలో కొత్త మార్పునకు తెరతీసింది. గూగుల్ భాగస్వామ్యంతో రూ.1.5కోట్లతో వర్సిటీలో ఏర్పాటు చేసిన అత్యాధు
విజ్ఞాన్స యూనివర్సిటీ కృత్రిమ మేధస్సు అథారి త విద్య విధానంలో మార్పునకు తెర


అమరావతి, 23 జూన్ (హి.స.)

అమరావతి: భవిష్యత్తు సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత విద్యా విధానంలో కొత్త మార్పునకు తెరతీసింది. గూగుల్ భాగస్వామ్యంతో రూ.1.5కోట్లతో వర్సిటీలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ‘గూగుల్ ఏఐ ల్యాబ్’ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు ప్రపంచ స్థాయి శిక్షణ, ఆధునిక పరిశోధన అవకాశాలు, అంతర్జాతీయ సర్టిఫికేషన్లు అందుబాటులోకి వచ్చాయి.

ఇక్కడ ప్రవేశపెట్టిన ‘గూగుల్ వర్క్స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్’ సబ్స్క్రిప్షన్తో బోధన పద్ధతుల్లో మార్పులు తెచ్చారు. జెమినీ ఏఐ సహాయంతో విద్యార్థులు ప్రజెంటేషన్ల తయారీ, డేటా విశ్లేషణ, వీడియో కంటెంట్ సృష్టి, రైటింగ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు పొందుతున్నారు. ఇది కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు సాంకేతిక ప్రయోగాల కేంద్రంగానూ మారుస్తున్నారు.

సర్టిఫికేషన్లకు వీలు

ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. క్లౌడ్ ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గూగుల్ సర్టిఫికేషన్లు అందిస్తుండడం ప్రత్యేకత.

విద్యార్థుల సందేహాలకు తక్షణ పరిష్కారాలు అందించేందుకు వీలుగా వ్యక్తిగత ఏఐ ట్యూటర్లు, నైపుణ్యాభివృద్ధి కోసం ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఏజెంట్ల రూపకల్పన, నూతన ఆవిష్కరణల్లో భాగంగా హ్యాకథాన్లు, స్టార్టప్ ఇంక్యుబేషన్, ఇండస్ట్రీ భాగస్వామ్య ప్రాజెక్టుల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు. ఈ ల్యాబ్ వర్సిటీకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఆవిష్కరణలు చేయాలన్నదే తమ లక్ష్యమని ఏఐఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ బోడపాటి జ్యోత్స్నాదేవి తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande