సర్ 2026. జాబితాలో మీ.పేరు ఉండాలంటే ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సిందే
సర్ 2026. జాబితాలో మీ.పేరు ఉండాలంటే ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సిందే
సర్ 2026. జాబితాలో మీ.పేరు ఉండాలంటే ఎన్యూమరేషన్ ఫారం నింపాల్సిందే


హైదరాబాద్, 23 జూన్ (హి.స.)

స్హైఆర్దరాబాద్: ‘‘సర్-2026 జాబితాలో మీ పేరు ఉండాలంటే ఎన్యుమరేషన్ ఫారం నింపాల్సిందే. ఏళ్లుగా ఓటేస్తున్నామంటే కుదరదు. ప్రతి రెండు దశాబ్దాలకో సారి దేశవ్యాప్తంగా చేపట్టే ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమం ఇది’’ అని జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో), జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి నగరంలో ఓటరు పత్రాల పంపిణీ మొదలవుతుందని, జులై 24న ముగుస్తుందన్నారు. సర్వే షెడ్యూలును వివరించేందుకు ఆయన సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు సందేహాలకు సమాధానం ఇచ్చారు. ‘‘ఎన్యుమరేషన్ పత్రాలు నింపినవారి వివరాలతో మాత్రమే ముసాయిదా ఓటరు జాబితా తయారవుతుంది. ముసాయిదాలోని ఓట్లపై నెల పాటు ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరిస్తాం. ఆయా ఓటర్లకు నోటీసులు ఇస్తాం. తగు పత్రాలను అందజేస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. అక్టోబరు 1, 2026న తుది ఓటరుజాబితా ముద్రిస్తాం. ముసాయిదా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలనూ ప్రకటిస్తాం. బీఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) ఇంటికి వచ్చిన సమయానికి తాళం వేసి ఉంటే తలుపు, కిటికీల నుంచి పత్రాలను లోపలికి వేస్తాం. వాటిలో వివరాలు నింపి సిద్ధంగా ఉంచుకోండి. మరో రోజు బీఎల్వో వచ్చి పత్రాలను తీసుకుంటారు. ఎన్యుమరేషన్ పత్రాలతో ఎలాంటి గుర్తింపు కార్డులను ఇవ్వాల్సిన అవసరం లేదు’’అని కర్ణన్ వివరించారు.

జాబితాలో పేరు లేకుంటే..?

ఎన్యుమరేషన్ పత్రాన్ని ఇవ్వరు. వారు ఓటరుగా నమోదయ్యేందుకు ఎప్పటిలాగే ఫారం-6 నింపాలి. వారికి సర్-2026 సర్వేతో సంబంధం ఉండదు. ఇటీవల ఎన్నికల్లో ఓటు వేసిన నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఇల్లు మారిన ఓటర్లకు కూడా ఎన్యుమరేషన్ పత్రం ఇవ్వరు. ప్రస్తుత ఓటరు గుర్తింపు కార్డులోని చిరునామాలోనే సదరు వ్యక్తులు ఎన్యుమరేషన్ ఫారం అందుకోవాలి. ఆ చిరునామాతోనే నింపి ఇవ్వాలి.

నగరంలో వివిధ రాష్ట్రాల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు ఆంగ్లంలో ముద్రించిన ఎన్యుమరేషన్ పత్రాన్ని పంపిణీ చేస్తున్నారు.

ఎన్యుమరేషన్ పత్రంలో నింపిన వివరాలు సరైనవని తెలుపుతూ ఓటరు లేదా ఓటరు కుటుంబ సభ్యులు సంతకం చేయాలి. జూనియర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బందిని బీఎల్వోలుగా నియమించాం. వారు ప్రతి పత్రాన్ని పరిశీలించి అందులోని వివరాలను బీఎల్వో యాప్లో నమోదు చేస్తారు. బీఎల్వో అప్లోడ్ చేసే వివరాలను సహాయ ఈఆర్వో, ఈఆర్వోలు ఆమోదిస్తారు. వారికి ఏ మాత్రం అనుమానం వచ్చినా సదరు ఓటరుకు నోటీసు వెళ్తుంది. అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు అవసరమైన పత్రాన్ని అడుగుతారు.

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande