కడప రేణిగుట రహదారి మండల పరిధిలో నీ ఉడుమువారిపల్లె వద్ద రోడ్డు.ప్రమాద
అమరావతి, 23 జూన్ (హి.స.) పుల్లంపేట, రాజంపేట, : ఓ లారీ డ్రైవర్ నిద్రమత్తు 11 నెలల బాలుడు, 16 ఏళ్ల బాలిక ప్రాణాలు బలికొనగా.. 17 మందిని క్షతగ్రాతులుగా మార్చింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ప్రమాదం కడప - రేణిగుంట రహదారిలో మండల పరిధిలోని ఉడమువారిపల
కడప రేణిగుట రహదారి మండల పరిధిలో నీ ఉడుమువారిపల్లె వద్ద రోడ్డు.ప్రమాద


అమరావతి, 23 జూన్ (హి.స.)

పుల్లంపేట, రాజంపేట, : ఓ లారీ డ్రైవర్ నిద్రమత్తు 11 నెలల బాలుడు, 16 ఏళ్ల బాలిక ప్రాణాలు బలికొనగా.. 17 మందిని క్షతగ్రాతులుగా మార్చింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ప్రమాదం కడప - రేణిగుంట రహదారిలో మండల పరిధిలోని ఉడమువారిపల్లె వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కడప డిపోకు చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు.. 35 మంది ప్రయాణికులతో తిరుపతి నుంచి కడపకు బయల్దేరింది. మార్గమధ్యలో తెల్లవారుజామున 2.30 గంటలు దాటిన తర్వాత పుల్లంపేటలో టీ కోసం డ్రైవర్ బస్సు నిలిపాడు. అక్కడి నుంచి బస్సు బయల్దేరిన నిమిషంలోనే ఎర్రగుంట్ల నుంచి సిమెంట్ లోడ్తో చెన్నైకు వెళ్తున్న లారీ మితిమీరిన వేగంతో ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఆ ధాటికి డ్రైవర్ వెనక ఉన్న సీట్లు మొత్తం చెల్లాచెదురుగా మారాయి. ఆ వైపు కూర్చున్న వారంతా బాధితులుగా మారారు. పురుషోత్తమ్ (11 నెలలు) ఎగిరి వంద మీటర్ల దూరంలో పడ్డాడు. మెదడు ఛిద్రం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. యశ్విత (16) తీవ్రగాయాలతో కడప రిమ్స్కు తరలిస్తుండగా మృతి చెందింది. మరో 17 మందికి తీవ్ర గాయాలు కావడంతో కడప, తిరుపతిలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలకు తరలించారు. క్షతగాత్రుల్లో యశ్విత సోదరి రమ్య పరిస్థితి విషమంగా ఉండగా.. తండ్రి దినకర్ కాలు విరిగింది. తల్లి స్వరూపకు స్వల్పగాయాలయ్యాయి. బస్సు, లారీ డ్రైవర్లు ఇంద్రసేనారెడ్డి, నాగేంద్ర చికిత్స పొందుతున్నారు. భారీ శబ్దం రావడంతో స్థానికులు పరుగున అక్కడి వెళ్లారు. యువకులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. సీఐ శ్రీనివాసులు బృందంతో అక్కడికి చేరుకుని క్షతగాత్రులను వైద్యశాలలకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande