
హైదరాబాద్, 23 జూన్ (హి.స.)
నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో గల అమెరికన్ కాన్సులేట్ వద్ద ఒక ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించటం తీవ్ర అభ్యంతరకరమని, ఈ నిర్ణయాన్ని సహించబోమని వామపక్షాలు పేర్కొన్నారు. వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించాయి. హైదరాబాద్లో కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం బషీర్బాగ్లోని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం నుంచి ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భాజపా, ఆర్ఎస్ఎస్ బాటలో నిర్ణయాలు తీసుకోవటం దుర్మార్గమన్నారు. నేతలు వీఎస్ బోస్(సీపీఐ), కె.గోవర్ధన్ (సీపీఐ-ఎంఎల్-న్యూ డెమోక్రసీ), ఎం.హన్మేశ్ (సీపీఐ-ఎంఎల్-మాస్లైన్), సీహెచ్ మురహరి (ఎస్యూసీఐ), మట్టయ్య(ఎంసీపీఐ) మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్