ఆంధ్రప్రదేశ్ 30 వేల మంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ 30 వేల మంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్  30 వేల మంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త


అమరావతి, 23 జూన్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ఈరోజు(మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల విద్యాసంస్థలు, సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, మెమో-57 ప్రకారం 2004 సంవత్సరానికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(CPS) నుంచి పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడంతో ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande