పేరు పెట్టండి.. రూ.లక్ష గెలవండి: తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
పేరు పెట్టండి.. రూ.లక్ష గెలవండి: తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
Telangana


హైదరాబాద్, 23 జూన్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత

తొలిసారిగా అల్పాదాయ వర్గాలకు (LIG) క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన లక్ష ప్లాట్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారునకు హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి మంచి పేరును నేరుగా ప్రజల నుంచే స్వీకరించాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. ప్రజల నుంచి వచ్చిన పేర్లలో ఉత్తమమైనదిగా ఎంపికైన పేరును సూచించిన వారికి ఒక లక్ష రూపాయల బహుమతిని అందచేస్తామని, సోషల్ మీడియా వేదికగా ఈ అంశంలో బహిరంగ పోటీని నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. క్యూర్ పరిధిలో అల్పాదాయ వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా లక్ష ఇండ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఎటువంటి వివాదాలు లేకుండా, అందుబాటులోని ధరల్లో వివిధ వర్గాల ప్రజల సొంత ఇంటి కలలను నెరవేర్చడంలో హౌసింగ్ బోర్డుకు మంచి పేరు ఉంది. అంతే కాకుండా బోర్డు ఆధ్వర్యంలో చేపట్టి ప్రాజెక్టులకు ప్రజల నుంచి ఆదరణతో పాటు డిమాండ్ కూడా ఉన్నదని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘం కాలం తరువాత చేపడుతున్న ప్రాజెక్టులో ప్రజలను కూడా భాగస్వామ్యులను చేయాలన్న ఆలోచనతో, ప్రజల నుంచి అందే సూచనలతోనే ఈ పథకానికి పేరును కూడా ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 28 వరకు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోటీని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు సూచించిన పేర్లలో ఉత్తమమైనదిగా ఎంపికైన దానికి లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande