నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారి పై ట్రాఫిక్ జామ్
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారి పై ట్రాఫిక్ జామ్
Traffic jam


యాదాద్రి-భువనగిరి , 23 జూన్ (హి.స.)

యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పై మంగళవారం ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారి పై ఆగి ఉన్న ఓ లారీని మరో లారీ వెనుక నుంచి ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో వాహనాలు దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో కొయ్యలగూడెం సమీపంలో సాంకేతిక లోపంతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జాతీయ రహదారిపైనే నిలిచిపోయింది. ఈ రెండు ఘటనల కారణంగా జాతీయ రహదారి పై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ట్రాఫిక్ జామ్ కారణంగా హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది సంఘటనా స్థలాలకు చేరుకుని దెబ్బతిన్న వాహనాలను పక్కకు తొలగించే చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడంతో ట్రాఫిక్ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande