
హైదరాబాద్, 23 జూన్ (హి.స.)
హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, విస్తరణపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, మనోహర్ లాల్ కట్టత్ో సీఎం జరిగిన చర్చలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు లేఖలు రాశారని ఈ నేపథ్యంలో గత రెండ్రోజులుగా ఢిల్లీలో ఇద్దరు కేంద్రమంత్రులతో సమావేశాల కోసం చొరవతీసుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా, రేవంత్ రెడ్డి, నేను కలిసి నిన్న అశ్వినీ వైష్ణవ్తో, ఇవాళ మనోహర్ లాల్ ఖట్టతో౯ సమావేశం అయ్యామని కేంద్రమంత్రులతో సీఎం సమావేశాలకు సమన్వయం చేశానని చెప్పారు ఈ రెండు సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగినట్లు వెల్లడించారు. కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేను రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం నావంతు కృషిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి పోస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు