
బద్వేలు , 23 జూన్ (హి.స.)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నా ఈ రెండేళ్లలో ఏమి సాధించారో చెప్పి సంబరాలు జరుపుకోవాలని ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షులు మునిరత్నం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ రోజు బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి వారి జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటే ఈ పరిస్థితి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించారు శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లేనిపక్షంలో నిరుద్యోగ యువతకు నెలకు ₹ 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి యువతను మోసం చేశారని అన్నారు.
డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ పారదర్శకంగా జరపాలని అన్నారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వెంటనే ప్రకటించాలని వారి డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడంలో నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV