
ఢిల్లీ, 13 జూలై (హి.స.)రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కీలక వ్యాఖ్యలు చేశారు. రామాలయ విరాళాల దొంగతనంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విచారం వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదని, ఇది కంటితుడుపు చర్యగా ఉందని విమర్శించారు.
ఈ తరహా విరాళాల అవకతవకలు కేవలం అయోధ్యకే పరిమితం కాలేదని, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో కూడా ఇలాంటి అక్రమాలు జరిగినట్లు నివేదికలు వస్తున్నాయని వేణుగోపాల్ తెలిపారు. ఈ భారీ విరాళాల కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఒక ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్