న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు సుశ్రుతమ్ 2026’: రేపు ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
న్యూఢిల్లీలో అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు సుశ్రుతమ్ 2026’: రేపు ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
President Droupadi Murmu(File Photo)


న్యూఢిల్లీ: , 14 జూలై (హి.స.)

శస్త్రచికిత్స పితామహుడు ఆచార్య సుశ్రుతుడి వారసత్వాన్ని, ఆయన వైద్య విధానాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ‘సౌశ్రుతమ్ 2026’ (Saushrutam 2026) పేరుతో నిర్వహించనున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం (జూలై 15) అధికారికంగా ప్రారంభించనున్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ‘ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద’ (AIIA) ఈ ప్రతిష్టాత్మక సెమినార్‌కు వేదిక కానుంది.జూలై 15 నుండి 17 వరకు జరిగే ఈ చారిత్రక సదస్సు కంటే ముందుగా, ఈరోజు (జూలై 14, మంగళవారం) ఒక రోజు ముందస్తు వర్క్‌షాప్‌ను అధికారులు నిర్వహించారు. ప్రతి సంవత్సరం జూలై 15న నిర్వహించే ‘ సుశ్రుత జయంతి ని పురస్కరించుకుని ఈ అంతర్జాతీయ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో రాష్ట్రపతితో పాటు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ఛార్జ్) ప్రతాపరావు జాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజీత్ సింగ్ సంధూ, లోక్‌సభ ఎంపీ రామ్‌వీర్ సింగ్ బిధూరి, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు.ఆయుర్వేద శస్త్రచికిత్స పరిజ్ఞానం మరియు ఆధునిక వైద్య శాస్త్ర సాంకేతికతలను అనుసంధానించడం (Integration of Ayurveda and Modern Surgical Sciences) ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ‘సౌశ్రుతమ్ 2026’ కార్యక్రమంలో భాగంగా నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ (NCISM) కు సంబంధించిన ఒక ప్రత్యేక అధ్యయనాన్ని విడుదల చేయడంతో పాటు, ఏఐఐఏ (AIIA) లో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎమ్‌ఆర్‌ఐ (MRI) సదుపాయాన్ని కూడా రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ వేదికపై ఆయుర్వేద శస్త్రచికిత్సల పురోగతిపై విస్తృతంగా చర్చించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande