
భోజ్‌శాల, 14 జూలై (హి.స.)
: మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అక్కడ ఎలాంటి నిర్మాణాత్మక మార్పులు చేసినా, కోర్టు ముందస్తు అనుమతి లేకుండా వాటిని అమలు చేయకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వివాదంలో ముస్లింల ప్రార్థనల కోసం చేసిన ఏర్పాట్లు కేవలం తాత్కాలికమేనని (Ad-hoc), తుది పిటిషన్ల తీర్పుకు లోబడి ఉంటాయని కోర్టు వివరించింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 నుండి 3 గంటల మధ్య ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వీలుగా వివాదాస్పద భోజ్‌శాల స్థలానికి ఆనుకుని ఉన్న ప్రత్యేక బహిరంగ ప్రదేశాన్ని కేటాయించాలని కోర్టు ఆదేశించింది. ఈ వివాదం అత్యంత సున్నితమైనదని, ప్రతి పదాన్ని ఆచితూచి ఉపయోగించాల్సి ఉంటుందని పేర్కొన్న ధర్మాసనం.. ఉద్రిక్తతలకు దారితీసే ఎలాంటి ఉత్తర్వులను జారీ చేయవద్దని, ఇరుపక్షాలు సంయమనం పాటించాలని సూచించింది. అవసరమైతే ఈ కేసును రోజువారీ ప్రాతిపదికన విచారించి సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi