అయోధ్య విరాళాల దుర్వినియోగం పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు నోటీసులు!
అయోధ్య విరాళాల దుర్వినియోగం పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు నోటీసులు!
Supreme court


న్యూఢిల్లీ, 13 జూలై (హి.స.)

ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ (Ayodhya Ram Temple) విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు (Supreme Court) ఈ వ్యవహారంపై విచారణ జరిపి.. కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నిధుల దుర్వినియోగంపై న్యాయస్థానం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయామాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపి, రామాలయ నిర్వహణను చూసుకునే 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్'కు కూడా తమ సమాధానాన్ని దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నిధుల దుర్వినియోగంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ సిట్ బృందంలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారనే వివరాలను కూడా ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశిస్తూ.. కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి (జూలై 20, 2026) వాయిదా వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande