శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ సస్పెండ్ ఉద్యోగి అరెస్ట్; విరాళాల దుర్వినియోగంపై చర్యలు
శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ సస్పెండ్ ఉద్యోగి అరెస్ట్; విరాళాల దుర్వినియోగంపై చర్యలు
FIR against employee for alleged irregularities in counting gifts at Badrinath temple


డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), 13 జూలై (హి.స.)

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీ బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) లో విరాళాల నిధుల అవకతవకలకు మరియు ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఒక సస్పెండ్ అయిన ఉద్యోగిని ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, రశీదుల నిధులను అధికారిక ఖాతాల్లో జమ చేయకుండా సొంతానికి వాడుకున్నట్లు సదరు ఉద్యోగిపై ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చిన వెంటనే ఆలయ కమిటీ ప్రాథమిక విచారణ జరిపి సదరు ఉద్యోగిని గతంలోనే విధుల్లోంచి సస్పెండ్ చేసింది. అనంతరం దీనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో, దర్యాప్తు చేపట్టిన రక్షక భటులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయ నిధుల పారదర్శకతను దెబ్బతీసేలా ప్రవర్తించిన ఎవరినీ ఉపేక్షించేది లేదని, భక్తుల నమ్మకాన్ని కాపాడటానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ కమిటీ వర్గాలు స్పష్టం చేశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande