పంటలకు తక్షణమే నీరు అందించాలని డిమాండ్ ... నీటి పారుదల శాఖ.కార్యాలయాన్ని రైతులు ముట్టడి
పంటలకు తక్షణమే నీరు అందించాలని డిమాండ్ ... నీటి పారుదల శాఖ.కార్యాలయాన్ని రైతులు ముట్టడి
పంటలకు తక్షణమే నీరు అందించాలని డిమాండ్ ... నీటి పారుదల శాఖ.కార్యాలయాన్ని రైతులు ముట్టడి


అమలాపురం, 14 జూలై (హి.స.)

పంటలకు తక్షణమే నీరు అందివ్వాలని డిమాండ్ చేస్తూ అమలాపురం నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని రైతులు మంగళవారం ముట్టడించారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులను నెట్టుకుంటూ వారంతా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఇరిగేషన్ డీఈ కార్యాలయం వద్ద రైతులంతా బైఠాయించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. కాలువల ఆధునికరణ పనుల పేరుతో నీటిని ఆపేసి పనులు చేయిస్తున్న అధికారుల వైఖరిని ఈ సందర్భంగా వారు నిలదీశారు.

కాంట్రాక్టర్కు సహకరించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఇరిగేషన్ డీఈ తక్షణమే తమ వద్దకు వచ్చి సమాధానం చెప్పాలంటూ నిరసన వ్యక్తం చేశారు. దాంతో డీఈ కార్యాలయానికి తాళం వేసేందుకు వారంతా సిద్ధమయ్యారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇరిగేషన్ డీఈ శ్రీరామ జనార్ధన్.. రైతులతో మాట్లాడారు. గురువారం సాయంత్రం కల్లా పూర్తిగా నీటిని అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన విరమించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande