ఆంధ్రా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ.విభాగంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు
ఆంధ్రా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ.విభాగంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు
ఆంధ్రా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ.విభాగంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు


అమరావతి, 17 జూలై (హి.స.)

ఏయూ ప్రాంగణం విద్యార్థులు చదువు పూర్తి చేసి ఉద్యోగానికి వేట మొదలెట్టే రోజులు కావివి.. చదువు పూర్తయ్యేలోపు ఉద్యోగం తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కళాశాలలోనే నైపుణ్యాలు పెంచుకుంటేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ఉద్దేశంతోనే అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో ఏయూలో ఎమ్మెస్సీ ద్వితీయ సంవత్సరం ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ చదువుతున్న 18మంది విద్యార్థులతో పాటు ఇప్పటికే చదువు పూర్తిచేసి బయటకు వెళ్లిన విద్యార్థులు మరో 20మందికి శిక్షణ ఇస్తున్నారు. వీరిలో సగం మంది విద్యార్థినులు ఉండటం గమనార్హం.

శిక్షణ పొందిన బయట విద్యార్థులలో ఒక్కొక్కరికి నెలకు రూ.9వేల చొప్పున ఉపకార వేతనం ఇస్తున్నారు. ఏయూ విద్యార్థులు చదువుతో పాటు శిక్షణ పొందుతున్నందున వారికి ఉపకార వేతనం చెల్లించడంలేదని కేంద్రం మేనేజర్ మనోహర్ రెడ్డి తెలిపారు. మొదటి బ్యాచ్ ఇటీవల ప్రారంభమైంది. ముగ్గురు బోధకులు, ఒక మేనేజర్తో పాటు మరో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. వీరి వేతనాలు, కేంద్రంలో వినియోగిస్తున్న యంత్రాలతో పాటు ప్రయోగశాలకు అవసరమయ్యే రసాయనాలు(కెమికల్స్) ఖర్చు సైతం ఫౌండేషన్ భరిస్తోంది. కొన్ని రకాల రసాయనాలు విదేశాల నుంచి తెప్పిస్తారు. బయట ప్రయివేటు నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో ఈ తరహా తర్ఫీదు పొందాలంటే రూ.2 లక్షల వరకు ఫీజు తీసుకుంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande