కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ క్యాషాస్ ట్రీట్మెంట్: మంత్రి దామోదర
కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ క్యాషాస్ ట్రీట్మెంట్: మంత్రి దామోదర
Collector


హైదరాబాద్, 17 జూలై (హి.స.)

అపోలో, యశోద, కిమ్స్, మెడికవర్, కామినేని, కాంటినెంటల్, కేర్, స్టార్, బసవతారకం వంటి ప్రముఖ కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు అత్యాధునిక వైద్య సేవలు పొందేలా న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (NEHS) ను తీసుకువచ్చామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ, పారదర్శకమైన క్యాషెస్ వైద్య సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన NEHS ను ఇవాళ రాష్ట్ర సచివాలంయలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దామోదర.. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మొత్తం 17,88,336 మంది లబ్ధిదారులకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. వీరిలో 4,38,594 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3,61,955 మంది పెన్షనర్లు, సుమారు 9.88 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పారు. ఈ స్కీమ్ అమలులో ఉద్యోగులు, పెన్షనర్ల కంట్రిబ్యూషన్కు సమానంగా ప్రభుత్వం కంట్రిబ్యూట్ చేస్తుందని.. ప్రతి పైసాను ఈహెచ్ఎస్ అమలు కోసమే వినియోగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 886 ప్రైవేట్ హాస్పిటల్స్తో పాటు 114 ప్రభుత్వ హాస్పిటల్స్ లో క్యాట్లెస్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ పథకంలో భాగస్వామ్యమైన అన్ని హాస్పిటళ్ల యాజమాన్యాలు, డాక్టర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, విద్య, సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం వెల్నెస్ సెంటర్లు లేని 24 జిల్లాల్లో కొత్తగా మరో 24 వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. ఈ వెల్నెస్ సెంటర్లను స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్తో అనుసంధానం చేసి, స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్యుల సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. వీటి ద్వారా బ్రాండెడ్ మందులు, ల్యాబ్ పరీక్షలు ఉచితంగా అందుతాయని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగు, వివిధ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు, నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande