
హైదరాబాద్, 17 జూలై (హి.స.)
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీటీడీ సీ) ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గానికి 12 కోట్ల రూపాయల తో కన్వెన్షన్ సెంటర్ ల ఏర్పాటుకు గాను అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకున్నారు. కొల్లాపూర్ నియోజక వర్గంలోని, చిన్నంబావి, వీపనగండ్ల, పానగల్, కోడేరు, పెద్దకొత్తపల్లి పెంట్లవెల్లి మండల కేంద్రాలలో కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ఒక్కో సెంటర్కు రూ. 2 కోట్లతో ఏర్పాటుకు గాను మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేయించారు. ప్రజలు తమ సాంఘిక కార్యక్రమాలు వివాహాలు, సమావేశాలు, సదస్సుల నిర్వహణకు ఈ సెంటర్లను ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి జూపల్లి కన్వెన్షన్ సెంటర్లను మంజూరు చేసినందుకు గాను ఆయా మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..