
మెదక్, 14 జూలై (హి.స.)
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మంగళవారం జిల్లాలోని కొల్చారం మండల కేంద్రoలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు లబ్ధిదారులకు సూచించారు. ఇంకా ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభించకుంటే రద్దు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. బిస్మిట్ వరకు పూర్తికాగానే మొదటి బిల్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు భారం కాకుండా ఉండేందుకు చిన్న సైజులో 450 ఫీట్ల నుండి నిర్మాణం చేసుకోవచ్చని తెలిపారు. ఇంకా ఇండ్ల నిర్మాణం ప్రారంభించన లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు