
ప్రకాశం జిల్లా, 14 జూలై (హి.స.)
:సింగరాయకొండలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన నలుగురు రైలు కిందపడి మృతి చెందారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమికంగా.. ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సింగరాయకొండ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలు, ఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ