ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత కేజ్రీవాల్ డిమాండ్: నిరాహార దీక్ష విరమించాలని సోనమ్ వాంగ్చుక్కు విజ్ఞప్తి, జూలై 16న భేటీ
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత కేజ్రీవాల్ డిమాండ్: నిరాహార దీక్ష విరమించాలని సోనమ్ వాంగ్చుక్కు విజ్ఞప్తి, జూలై 16న భేటీ
Aam Aadmi Party (AAP) national convener Arvind Kejriwal


హైదరాబాద్, 14 జూలై (హి.స.)

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను తన దీక్షను విరమించాలని కోరారు. నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ వివాదం, పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

దీక్ష కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేజ్రీవాల్, ఆయన ప్రాణం దేశానికి ఎంతో విలువైందని పేర్కొన్నారు. ఈ పోరాటంలో తాము వాంగ్‌చుక్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, రాబోయే గురువారం (జూలై 16) నాడు కేజ్రీవాల్ స్వయంగా జంతర్ మంతర్ నిరసన స్థలానికి వెళ్లి సోనమ్ వాంగ్‌చుక్‌ను వ్యక్తిగతంగా కలవనున్నట్లు వెల్లడించారు. నీట్ లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జూన్ 28 నుండి వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande