తమిళనాడు: తిరువళ్లూరు ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు.. ఒకరు మృతి.. నేల కూలిన ఐదు గదులు
తమిళనాడు: తిరువళ్లూరు ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు.. ఇకరుమృతి.. నేల కూలిన ఐదు గదులు
fire


తిరువళ్లూరు:, 14 జూలై (హి.స.)

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పార్థపాళ్యం గ్రామ సమీపంలో ఉన్న గుమ్మిడిపూండి సిప్‌కాట్ (SIPCOT) పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ మెటల్ స్మెల్టింగ్ (లోహాన్ని కరిగించే) ఫ్యాక్టరీలో భారీ బాయిలర్ పేలిపోవడంతో ఒకరుు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

తిరువళ్లూరు పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని బీహార్‌కు చెందిన రవి రంజన్‌గా గుర్తించారు. బాయిలర్ పేలిన తీవ్రతకు అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిలో భూషణ్ కుమార్, ఓం కుమార్, రంజిత్ కుమార్, సింబర్ సింగ్‌లను గుమ్మిడిపూండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజా బాబు, రణ్‌వీర్ కుమార్, ఫ్రెండ్స్ కుమార్‌లను చెంగల్పట్టులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన ప్రిన్స్ కుమార్ అనే మరో కార్మికుడిని మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కార్మికులంతా బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా పోలీసులు తెలిపారు.బాయిలర్ పేలుడు సంభవించిన వెంటనే ఫ్యాక్టరీ ప్రాంగణంలో భారీగా మంటలు అంటుకున్నాయి. గుమ్మిడిపూండి, చిప్పాడై ఫైర్ స్టేషన్ల నుండి వచ్చిన రెండు అగ్నిమాపక బృందాలు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. గుమ్మిడిపూండి డీఎస్పీ శశిధరన్ పర్యవేక్షణలో అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫ్యాక్టరీ పరిసరాల్లో చెల్లాచెదురుగా పడిన శిథిలాల కింద మరికొంత మంది కార్మికులు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande