
డోన్ పట్టణం:, 15 జూలై (హి.స.)
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో డోన్ బాలిక చోటు దక్కించుకుంది. హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలోని విక్టరీ ఆడిటోరియ ప్రాంగణంలో ఫిబ్రవరి 2వ తేదీన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో 2 వేలమందితో కీబోర్డు వాయిద్యం పోటీ జరిగింది. పది రాష్ట్రాలతోపాటు పలు దేశాలకు చెందిన 2 వేల మంది వాయిద్యకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. వీరందరూ నిర్విరామంగా గంటపాటు కీబోర్డుపై పాశ్చాత్య సంగీతం ప్లే చేశారు. వారిలో 777 మంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్నారు. డోన్ పట్టణానికి చెందిన సాంజో పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కొండెపోగు సుజన్ గ్రేస్ కూడా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని నిర్మల బాలికకు గిన్నిస్ ప్రశంసా పత్రంతోపాటు మెడల్ను అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ