జాతీయ రహదారి.పై రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తి దుర్మరణం
జాతీయ రహదారి.పై రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తి దుర్మరణం
Accident


పెందుర్తి , 15 జూలై (హి.స.)

పెందుర్తి మండలం సరిపల్లి వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిలో మంగళవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి పెందుర్తి సీఐ కె.వి.సతీశ్కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన కీర్తి మాణిక్యాలరావు (56) వేరుశెనగ తొక్కును దుకాణాలకు విక్రయిస్తుంటారు. ఈ మేరకు సోమవారం మినీ వ్యాన్లో గొల్లప్రోలు నుంచి బయలుదేరి అనకాపల్లిలో దుకాణాల వద్ద సరకు దింపారు. అనంతరం ఆనందపురం వైపు వెళ్తుండగా సరిపల్లి పైవంతెన వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న రెండు లారీల మధ్యలోకి వెళ్లడంతో వెనుక వస్తున్న ట్యాంకర్ లారీ మినీ వ్యాన్ను ఢీకొట్టడంతో ముందున్న లారీ వైపు దూసుకుపోయి ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో మాణిక్యాలరావు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ ఒడిసెల నాగరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. తక్షణమే పోలీసులు 108 వాహనంలో క్షతగాత్రుడిని కేజీహెచ్కు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు సీఐ సతీశ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మాణిక్యాలరావుకు భార్య లలిత, ముగ్గురు సంతానం ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande