
కర్నూలు, 15 జూలై (హి.స.) కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో ఎంపీ నిధులు రూ.5 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ కూటమి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ బడులను ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతోందన్నారు.
ఇక చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్న ఎంపీ, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, ఆర్.డబ్ల్యూ.ఎస్ డీ.ఈ అమల, ఏ.ఈ రంగస్వామి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV