జీహెచ్ఎంసీ వీధి దీపాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వీధి దీపాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
GHMC building


హైదరాబాద్, 15 జూలై (హి.స.)గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) వీధి దీపాల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1,341.60 కోట్ల స్ట్రీట్ లైటింగ్ ఓ అండ్ ఎం (O&M) ప్రాజెక్టులో మార్పులకు ఆమోదం తెలిపింది. 10 ఏళ్ల పాటు LED స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సవరించింది. సీసీఎంఎస్ (CCMS) బాక్సుల మార్పు 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. LED స్ట్రీట్ లైట్ల మార్పునకు రెండేళ్ల గడువు విధించింది.

అలాగే టెండర్ అర్హత ప్రమాణాల్లో కూడా మార్పులు చేసింది. సాల్వెన్సీ నిబంధనను కాంట్రాక్ట్ విలువలో 10 శాతానికి సవరించింది. ఏటా 15 వేల అదనపు లైట్ల సరఫరా చేయాలని.. 10 ఏళ్ల పాటు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈఎండీ, పెర్ఫార్మెన్స్ గ్యారంటీకి ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లకు అనుమతి ఇచ్చింది. CURE ప్రాంత ప్రాజెక్టుకు జీహెచ్ఎంసీ (GHMC)నే నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande