అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య కేసు.. 14 ఏళ్ల బాలుడి అరెస్ట్
తెలంగాణకు చెందిన యువకుడు కుంచ అన్షుల్ (28) అమెరికాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే.
Telangana boy killed


హైదరాబాద్, 15 జూలై (హి.స.)తెలంగాణకు చెందిన యువకుడు కుంచ అన్షుల్ (28) అమెరికాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో 14 ఏళ్ల బాలుడిని అగ్రరాజ్య (USA) పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఫిలడెల్ఫియాకు చెందిన నిందితుడిని హత్య, దొంగతనం అభియోగాలపై జులై 10న అరెస్ట్ చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. అయితే, ఘటన సమయంలో ఆ బాలుడితో ఉన్న మరో వ్యక్తి ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. ఆ వ్యక్తి కోసం గాలింపు చేపట్టామని, ఈ కేసు (Telangana Man murder case)లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

నార్త్ ఫిలడెల్ఫియాలో జూన్ 5న అన్షుల్ హత్యకు గురయ్యాడు. ఎడ్గ్లీ స్ట్రీట్లో నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంటికి పిజ్జాలు డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన అతడిపై దుండగులు దాడి చేశారు. తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అన్షుల్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చోరీ కోసమే దుండగులు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే పిజ్జాలు ఆర్డర్ చేసి కాల్పులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్.. 2023లో అమెరికా వెళ్లాడు. కేడబ్ల్యూసీ సంస్థలో ఉద్యోగం చేస్తూ.. అదనపు ఆదాయం కోసం వారాంతాల్లో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేసేవాడని కుటుంబసభ్యులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande